ఎన్నికలు జరిగే గ్రామాల్లో 163(BNS) చట్టం అమలు: కలెక్టర్
WGL: మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే మండలాలు, గ్రామ పంచాయతీల్లో 163(BNS) చట్టాన్ని అమలు చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్య శారద తెలిపారు. సైలెన్స్ పీరియడ్‌లో బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రచారాలు నిషేధమని స్పష్టం చేశారు. డిసెంబర్ 18న ఉదయం 10 గంటల వరకు బయటి వ్యక్తులు గ్రామాల్లో ఉండరాదని, గుంపులు ఏర్పడకుండా పర్యవేక్షించాలన్నారు.