జూనియర్ కాలేజీలో ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభం

VSP: విశాఖలోని అసెంట్ జూనియర్ కళాశాలలో క్రోమా ఐ కేర్ సహకారంతో మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి సంరక్షణ ప్రాధాన్యం గురించి ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ దీప్తి, కళాశాల యాజమాన్యం, జనసేన నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు.