వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం

వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం

ప్రకాశం: హనుమంతునిపాడు మండలంలోని ఆవుల వారి పల్లి గ్రామంలో శనివారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. కళ్యాణాన్ని తిలకించేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామి కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. మండల టీడీపీ అధ్యక్షులు సాని కొమ్ము తిరుపతిరెడ్డి, ముక్కు చిన్న నరసారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.