పురిటి లోనే శిశువు మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన
BDK: మణుగూరు ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో ఇవాళ విషాద ఘటన చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల పురిటిలోనే చిన్న పాప మృత్యువాత పడినట్లు స్థానికులు తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.