VIDEO: బాన్సువాడ పోస్ట్ ఆఫీస్‌లో దొంగల దాడి
KMR: బాన్సువాడ PSకు కూత వేటు దూరంలోని పోస్ట్ ఆఫీసులో దొంగలు చొరబడి వాచ్‌మెన్ సాయిలుపై కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో వాచ్‌మెన్ సాయిలు తలకు తీవ్ర గాయం కావడంతో రక్తస్రావమై సొమ్మసిల్లి పడిపోయాడు. స్పందించిన అధికారులు సాయిలును బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయన తలకు 52 స్టిచ్చెస్ వేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.