రైస్ మిల్లును తనిఖీ చేసిన సబ్ కలెక్టర్

రైస్ మిల్లును తనిఖీ చేసిన సబ్ కలెక్టర్

PPM: పాలకొండ మండలం తుమరాడలో మారుతి రైస్ మిల్‌ను సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ ఆదివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ధాన్యం స్టాక్, కొనుగోలు రికార్డులు, బరువుల పుస్తకాలను పరిశీలించారు. రైతులకు న్యాయం జరిగేలా కొనుగోళ్లు పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ తనిఖీలు చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. తనిఖీలో సివిల్ సప్లైస్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.