'ఈ సర్కార్ కేవలం 11వేల ఉద్యోగాలే ఇచ్చింది'
TG: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిందని మాజీమంత్రి KTR అన్నారు. 'జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టి ఇంత వరకు ఒక్క ఉద్యోగం ఇచ్చింది లేదు. రాజీవ్ యువ వికాసం అని చెప్పారు. 67 వేల ఉద్యోగాలు ఇచ్చామని పదే పదే చెబుతున్నారు. కానీ, కేవలం 11,921 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చి ఇస్తామన్న ఏడాదికి 2లక్షల ఉద్యోగాలు ఎక్కడ' అని ప్రశ్నించారు.