అంతరాష్ట్ర దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు
ELR: తెలుగు రాష్ట్రాలలో సుమారు 100 పైగా దొంగతనం కేసులు ఉన్న అంతరాష్ట్ర దొంగను ఏలూరు త్రీ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. ముద్దాయి వద్ద నుంచి 7 కాసుల బంగారు ఆభరణాలు, కిలోన్నర వెండి వస్తువులు, రూ.5,00, 000 నగదు, 2 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామని, ముద్దాయిని కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ శ్రావణ కుమార్ తెలిపారు.