'వరి ధాన్యం కొనుగోళ్ళు పారదర్శకంగా చేపట్టాలి'

'వరి ధాన్యం కొనుగోళ్ళు పారదర్శకంగా చేపట్టాలి'

NRPT: వరి ధాన్యం కొనుగోళ్ళు పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం నారాయణపేట ఆర్డీవో కార్యాలయంలో వరి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో 110 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు చేపట్టాలని సూచించారు.