నిందితులను శిక్షించాలని తహసీల్దార్‌కు వినతిపత్రం

MBNR: బాలానగర్ మండలంలోని కేతిరెడ్డిపల్లి గ్రామంలో 4 రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు అంబేద్కర్ చూపుడు వేలును ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహ చూపుడు వేలు ధ్వంసం చేయడం దారుణం అన్నారు.