ఎస్పీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ఎస్పీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

MHBD: జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ జాతీయజెండాను ఎగురవేసారు. ఆయన మాట్లాడుతూ.. ఎంతోమంది త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్య్రం వచ్చిందని, వారందరినీ స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.