డేటా లీకేజీలపై విచారణ జరుపుతాం: ఫడ్నవీస్
వివాదాస్పద నాసిక్ బాబా అశోక్ ఖారత్ కాల్ డేటా రికార్డ్స్ లీకేజీల ఆరోపణలపై విచారణ జరుపుతామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హామీ ఇచ్చారు. ఆయన ఆస్తుల గురించి ఈడీ దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు. అధికారిక సంస్థలకు తప్ప అటువంటి కాల్ డేటా పొందే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. లీకేజీ బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని వెల్లడించారు.