క్షతగాత్రులను పరామర్శించిన దేవాదాయ శాఖ మంత్రి
SKLM: కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటన స్థలాన్ని ఆదివారం దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఘటన జరిగిన తీరును అధికారులను తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించారు. స్థానిక ఎమ్మెల్యే శిరీష పాల్గొన్నారు.