సింహ వాహనంపై దర్శనమిచ్చిన ఖాద్రీ నరసింహుడు
సత్యసాయి: కదిరిలోని లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమవారం సాయంత్రం స్వామి వారు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ మాడ వీధుల్లో శాస్త్రోక్తంగా జరిగిన ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మార్చి 13 వరకు 15 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం, రాత్రి సమయాల్లో స్వామి వారు వివిధ వాహనాలపై దర్శనమిస్తున్నారు.