'బాల్యవివాహాల నిర్మూలనకు కృషి చేయాలి'
NRML: జిల్లాలో బాల్యవివాహాల నిర్మూలన కోసం రేపటి నుంచి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆదివారం తెలిపారు. డిసెంబర్ 1 వరకు ఐసీడీఎస్ అధికారులు, గ్రామస్థాయిలో ర్యాలీలు, పూజారులు, ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బాల్యవివాహాల నిర్మూలనకు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.