మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసిన ఎంపీడీవో

మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసిన ఎంపీడీవో

ప్రకాశం: కంభం పట్టణంలోని స్థానిక బాలిక ఉన్నత పాఠశాలను ఎంపీడీవో వీరభద్రాచారి మంగళవారం సందర్శించారు..ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని ఆయన రుచి చూశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బోడయ్య, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.