ఫైబర్ నెట్ కేబుల్స్ తొలగింపు

NGKL: విద్యుత్ స్తంభాలకు ఉన్న ఫైబర్ నెట్ కేబుళ్లను విద్యుత్ శాఖ అధికారులు తొలగించడంతో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఇంటర్నెట్ ఆపరేటర్లకు 15 అడుగుల ఎత్తులో కేబుళ్లు వేసుకోవాలని సూచించినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఏఈ మాన్య నాయక్ తెలిపారు. రెండు రోజుల్లోగా కేబుళ్లను సరిచేసుకోకపోతే మరిన్ని తొలగింపులు ఉంటాయని ఆయన హెచ్చరించారు.