ఏపీఐఐసీ బోర్డు డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం
AP: పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థకు బోర్డు డైరెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలు జిల్లాల నుంచి 15 మంది సభ్యులను బోర్డు డైరెక్టర్లుగా నియమించింది. వీళ్లంతా రెండేళ్లపాటు పదవిలో కొనసాగనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సంబంధిత కార్యాచరణ చేపట్టాలని ఏపీఐఐసీ ఎండీకి ఆదేశిస్తూ.. పరిశ్రమలు, వాణిజ్యశాఖ కార్యదర్శి యువరాజ్ ఉత్తర్వులు ఇచ్చారు.