ఘనంగా విశ్వకర్మ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ఘనంగా విశ్వకర్మ  బ్రహ్మోత్సవాలు ప్రారంభం

జగిత్యాల జిల్లా కేంద్రంలో విశ్వకర్మ బ్రహ్మోత్సవాల వేడుకలు పురస్కరించుకొని పట్టణంలో గల విశ్వబ్రాహ్మణస్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు జరిగే వేడుకలలో వివిధ రకాలుగా స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తామని అనంతరం సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి రోజున నిమర్జనం చేస్తామని నిర్వాహకులు తెలియజేశారు .