కళాశాలలో చోరీ.. ముగ్గురు అరెస్ట్
RR: అబ్దుల్లాపూర్ మెట్ PS పరిధిలోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాలలో గత నెల 10న చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై DCP అనురాధ మాట్లాడుతూ.. ఈ కేసులో అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని, వారి వద్ద నుంచి రూ. 37 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు.