రెండు బైకులు ఢీ.. ఇద్దరికి గాయాలు
అన్నమయ్య: తంబళ్లపల్లె మండల కేంద్రంలో సోమవారం రెండు బైకులు ఎదురెదురుగా ఢీ కొని ఇద్దరు యువకులు గాయపడ్డారు. హరీశ్ కుమార్ బైక్‌పై సిద్ధారెడ్డిగారి పల్లెకు వెళ్తుండగా, వినయ్ కుమార్ స్టేట్ బ్యాంక్ ATM వద్దకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇందులో ఇద్దరూ గాయపడటంతో వారికి ప్రథమ చికిత్సలు అందించి, మెరుగైన వైద్యం కోసం మదనపల్లెకు తరలించారు.