'డోర్ టు డోర్ చెత్త సేకరణ పక్కాగా ఉండాలి'

'డోర్ టు డోర్ చెత్త సేకరణ పక్కాగా ఉండాలి'

RR: డోర్ టు డోర్ చెత్త సేకరణ పక్కాగా ఉండాలని బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్ చంద్ర సిబ్బందిని ఆదేశించారు. ఇవాళ ఉదయం ఆయన నగర పాలక సంస్థ పరిధిలో 18వ డివిజన్‌లోని భరత్ నగర్ కాలనీలో డోర్ టు డోర్ చెత్త సేకరణను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చెత్త సేకరణ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దని సిబ్బందిని ఆదేశించారు.