టేకుమట్ల గ్రామసభలో పాల్గొన్న కలెక్టర్
MNCL: జైపూర్ మండలం టేకుమట్ల రైతు వేదికలో నిర్వహించిన గ్రామసభలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా వ్యవసాయ, మండల అధికారులతో కలిసి పథకాల అమలును సమీక్షించారు. గ్రామాల్లో పారిశుధ్యం, సాగునీరు, రాబోయే ఖరీఫ్ సీజన్‌కు విత్తనాలు, ఎరువుల లభ్యతపై రైతులకు అవగాహన కల్పించి, ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.