VIDEO: సీసీ కెమెరాల వివాదం.. యజమానిపై దాడి..!

VIDEO:  సీసీ కెమెరాల వివాదం.. యజమానిపై దాడి..!

అన్నమయ్య: రాజంపేట బోయినపల్లిలోని ప్రియా లేడీస్ హాస్టల్ యజమానిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. హాస్టల్ బాత్రూంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. దాడిలో తీవ్రంగా గాయపడిన యజమానిని చికిత్స కోసం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.