సెప్టెంబరు 3న జిల్లాకు సీఎం

ATP: సీఎం చంద్రబాబు నాయుడు సెప్టెంబరు 3న అనంతపురానికి రానున్నారు. నగరంలో ‘సూపర్-6, సూపర్ హిట్’ పేరుతో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం పాల్గొంటారని నేతలు తెలిపారు. వాస్తవానికి ఈ సభను ఈ నెల 25న నిర్వహించాలని భావించినా అనివార్య కారణాలతో వచ్చే నెలకు వాయిదా పడింది. సభ ఏర్పాట్లపై జిల్లా నేతలు దృష్టి సారించారు.