రేపు ఈ ప్రాంతాల్లో పవర్ కట్
కృష్ణా: నందమూరు సబ్‌స్టేషన్ పరిధిలో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. ఉంగుటూరు సెక్షన్‌లోని 11కేవీ ఇందుపల్లి AGL ఫీడర్ లైన్ల మరమ్మతుల కారణంగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇందుపల్లి, ఓండ్రంపాడు, వెల్దిపాడు, ఎలుకపాడు గ్రామాల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సరఫరా ఉండదని AE జీ.బీ. శ్రీనివాసరావు తెలిపారు.