'క్షేత్ర స్థాయిలో 12 రోజులు పర్యటనలు చేయాలి'
NLR: జిల్లా అధికారులు ప్రతి నెలలో 12 రోజులు గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. పర్యటనల్లో ప్రభుత్వ పథకాల అమలుపై సమగ్ర పరిశీలన చేసి నివేదికలు సమర్పించాలని సూచించారు. ప్రజా స్పందనను కూడా తెలియజేయాలని కోరారు. ఇటీవల కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.