పాలిసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
TG: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘పాలిసెట్’ దరఖాస్తు గడువును రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణా మండలి పొడిగించింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులకు ఇది ఒక మంచి అవకాశమని అధికారులు వెల్లడించారు. ఎలాంటి లేట్ ఫీజు లేకుండానే రేపటి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా, షెడ్యూల్ ప్రకారమే మే 13న పాలిసెట్ పరీక్ష జరగనుంది.