సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు: జిల్లా వైద్యాధికారి

PDPL: సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి వైద్య సిబ్బందిని ఆదేశించారు. పెద్దపల్లిలోని తన కార్యాలయంలో జిల్లాలోని మల్టిపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నిషియన్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందు జాగ్రత్త చర్యగా అన్ని గ్రామాలలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో జాగ్రత్తగా ఉండాలన్నారు.