బాత్రూంలో జారిపడి వ్యక్తి మృతి

బాత్రూంలో జారిపడి వ్యక్తి మృతి

WNP: వనపర్తి పట్టణంలోని రాయిగడ్డలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. రాగి వేణు (53) అనే వ్యక్తి ఉదయం ప్రమాదవశాత్తు బాత్రూంలో జారిపడటంతో తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.