నిషేధానికి ముందే నిలిచిన బోట్లు

నిషేధానికి ముందే నిలిచిన బోట్లు

BPT: సముద్ర జీవుల పునరుత్పత్తి నేపథ్యంలో ఈ నెల 15 నుంచి మత్స్య వేట నిషేధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమయంలో వేటాడితే అవి అంతరించి పోతాయని, 2 నెలల పాటు సముద్రంలో వేట నిషేధిస్తున్నామన్నారు. మత్స్య వేట చేస్తే జరిమానా విధిస్తామన్నారు. కాగా, అధిక ఎండల ప్రభావంతో మత్స్యసంపద లభించడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. దీంతో మొదటి వారం నుంచి బోట్లు నిలివేసినట్లు పేర్కొన్నారు.