జిల్లా మార్పు ఒప్పుకోం: జనసేన నాయకులు

సత్యసాయి: పుట్టపర్తి జనసేన నాయకులు శ్రీ సత్యసాయి జిల్లాను మార్చే యత్నాలను ఖండించారు. పుట్టపర్తి ప్రజల కల సత్యసాయి జిల్లా అని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు జిల్లా కొనసాగింపుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. పుట్టపర్తి ఆధ్యాత్మిక కేంద్రం కావడంతో ప్రజల భావోద్వేగాలను దెబ్బతీసే మార్పులు సహించబోమని హెచ్చరించారు.