ఎస్సీ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు
MNCL: జిల్లాలోని షెడ్యూల్ కులాల నిరుద్యోగ యువతీ, యువకులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థిక పురోగతి పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 8 లోగా OBMMS పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.