పర్యాటక అభివృద్ధికి నిధులు మంజూరు
SRD: మనూర్ మండలం పరిధిలోని బోరంచ గ్రామంలో గల నల్లపోచమ్మ, సంగమేశ్వర దేవాలయాల వద్ద గల మంజీరా బ్యాక్ వాటర్లో టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 2.05 కోట్ల నిధులు విడుదల చేసిందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. నారాయణఖేడ్ ప్రాంతాన్ని టూరిజంలో అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించామాన్నారు.