80 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి: ఆర్డీవో

MDK: తూప్రాన్ డివిజన్ పరిధిలోని 6 మండలాల్లో 81 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, 80 కేంద్రాల్లో విక్రయాలు పూర్తయినట్లు ఆర్డీవో జయచంద్ర రెడ్డి తెలిపారు. తూప్రాన్లోని రైస్ మిల్లును ఆయన పరిశీలించారు. మనోహరాబాద్ మండలం పోతారంలో వరి కోతలు ఆలస్యం కావడంతో కొనుగోళ్లు ఇంకా ప్రారంభం కాలేదన్నారు.