'విద్యార్థినులకు దాతల చేయూత'

'విద్యార్థినులకు దాతల చేయూత'

VKB: దోమ మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ పాఠశాలలో దాతలు ఆర్యన్ రాజ్పుత్, దీపన్ భూపతి, సంఘ సేవకురాలు అనిత, నిఖిత సహకారంతో రూ. 80వేల విలువ గల క్రీడా సామగ్రిని అందించారు. క్రీడలు మానసిక, శారీరక దారుఢ్యానికి ఎంతో దోహదపడతాయని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గ్యమానాయక్, డీటీ నర్సిములు, ఎంఈవో వెంకట్, ఎస్సై వసంత్ జాదవ్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.