MISSWORLD పోటీలు.. ముస్తాబవుతున్న భాగ్యనగరం

HYD: మిస్ వరల్డ్ పోటీల కోసం హైదరాబాదు ముస్తాబవుతుంది. ఈ మేరకు రహదారులు, పర్యాటక కేంద్రాలు, ముఖ్యమైన భవనాలు సుందరంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీ అడుగులు వేస్తోంది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశాలు మేరకు భాగ్యనగరంలోని అతిథులు తిరిగి రహదారులపై గుంతలు లేకుండా చూసుకోవడం, లైన్ మార్కింగ్, కాలిబాటలు కూడళ్ల సుందరీకరణ, పచ్చదనం వంటి ఏర్పాట్లను చేస్తున్నారు.