పారిశుధ్య పనులను సందర్శించిన ఎంపీడీవో
AKP: నాతవరం మండలం గొలుగొండపేటలో శుక్రవారం జరిగిన ప్రత్యేక పారిశుద్య పనులను ఎంపీడీవో ఎంఎస్.శ్రీనివాస్ పరిశీలించారు. మొంథా తుపాన్ ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో మూర్తిబాబు, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.