ప్రభుత్వ పాఠశాలలో SMART ల్యాబ్ ప్రారంభం

ADB: ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని సంజయ్ నగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ఆర్పీఎల్)లో స్మార్ట్ ల్యాబ్‌ను ప్రారంభించారు. సోమవారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అడల్ట్ ఎడ్యుకేషన్ డీడీ శ్రీనివాస్ రెడ్డి, ఎంఈఓ సోమయ్య రిబ్బన్ కట్ చేసి ల్యాబ్‌ను ప్రారంభించారు. విద్యార్థుల కోసం 5 కంప్యూటర్లు, 5 టేబుల్స్, 10 కుర్చీలను అందించారు.