జిల్లాలో రూ.8కి చేరిన కోడి గుడ్డు ధర

జిల్లాలో రూ.8కి చేరిన కోడి గుడ్డు ధర

MLG: జిల్లాలో కూరగాయల ధరతో పాటు, సాధారణ ప్రజానీకానికి అందుబాటులో ఉండే గుడ్డు ధర సైతం పైపైకి ఎగబాకుతోంది.నిన్న మొన్నటిదాకా రూ.6 పలికిన గుడ్డు ధర.. ప్రస్తుతం రూ.8కి చేరుకుంది. దీంతో అటు కూరగాయలు, గుడ్లు సైతం కొనలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ఏటూరునాగారం,మంగపేట, కన్నాయిగూడెం మండలాల్లోని పలు షాపుల నిర్వాహకులు కోడి గుడ్ల దిగుమతిని కూడా నిలిపివేశారు.