డీఈవోలు, ఎంఈవోలు క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందే: మంత్రి
AP: డిసెంబర్ 5న మెగా పీటీఎంకు ఏర్పాట్లు చేయాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు డీఈవోలు, ఎంఈవోలు క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందేనని వెల్లడించారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పరిపాలనకు సంబంధించి యూనిఫైడ్ యాక్ట్ రూపొందించాలని అధికారులకు సూచించారు. ఉన్నత విద్య పాఠ్యప్రణాళికను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.