ప్రయాణికులతో రద్దీగా మారిన రైల్వే స్టేషన్లు
HYD: సంక్రాతి పండుగకి ఊర్లకు వెళ్లే ప్రయాణికులతో HYDలోని సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. ‘రైల్ వన్’ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే 3 శాతం డిస్కౌంట్ లభిస్తుందని రైల్వే అధికారులు చెప్పారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. పండుగ కోసం 150 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.