హిందూ సమ్మేళనం కరపత్రం ఆవిష్కరణ

హిందూ సమ్మేళనం కరపత్రం ఆవిష్కరణ

JGL: రాయికల్ మండలంలోని కట్కాపూర్‌లో మే 2న నిర్వహించనున్న హిందూ సమ్మేళనం కరపత్రాన్ని మంగళవారం సర్పంచ్ పడాల పూర్ణిమ ఆవిష్కరించారు. ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో గోపూజ, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ఉంటుందని పేర్కొన్నారు. సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో రావాలన్నారు.