రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు: కలెక్టర్

TPT: తిరుపతి జిల్లాలో రానున్న మూడు రోజులు వర్షాలు, భారీ ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. పిడుగులు కూడా భారీగా పడే అవకాశం ఉందని, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మండలాల్లో కంట్రోల్ రూము ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్కడైనా కూలిపోయే భవనాలు ఉంటే గుర్తించి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారన్నారు.