VIDEO: నత్త నడకన కొనసాగుతున్న రోడ్డు మార్గం పనులు
ADB: తాంసి మండలంలోని పొచ్చెర గ్రామం మీదుగా బండలనాగపూర్-కప్పర్ల రోడ్డు మార్గం పనులు నత్త నడకన కొనసాగుతున్నాయని వాహనదారులు తెలిపారు. రోడ్డు మార్గం పూర్తిగా కంకర తేలి ఉండటంతో వాహనాలు జారి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వాహనాలు రోడ్డుపై ప్రయాణించడంతో దుమ్ము ధూళితో ఇక్కట్లకు గురవుతున్నామని పేర్కొన్నారు.