VIDEO: బాసర క్షేత్రంలో వైభవంగా గంగ హారతి పూజలు
NRML: బాసరలోని పవిత్ర గోదావరి నది తీరాన శనివారం రాత్రి గంగ హారతి పూజలు వైభవంగా నిర్వహించారు. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ వైదిక బృందం ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. ముందుగా శివాలయంలో స్వామివారికి గోదావరి జలాలతో అభిషేకం, అర్చనలు పూర్తి చేసి, అనంతరం నదీ తీరాన గోదారమ్మకు హారతి ఇచ్చారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.