రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

NRML: దిలావర్ పూర్ మండల కేంద్రం సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వర్ణ గ్రామానికి చెందిన రాజు, సాయవ్వలకు తీవ్ర గాయాలయ్యాయి. రాజు, సాయవ్వలు రాంపూర్‌లోని బంధువుల ఇంటికి వచ్చితిరిగి బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజు, సాయవ్వలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.