రైల్వే స్టేషన్ సమీపంలో వృద్ధుడు మృతి

రైల్వే స్టేషన్ సమీపంలో వృద్ధుడు మృతి

MDCL: చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో వీవీ లాడ్జ్ ఎదురుగా రోడ్డు పక్కన భిక్షాటన చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. అక్కడ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న అభిలాష్(25) పలుమార్లు పిలిచినా స్పందించకపోవడంతో పరిశీలించగా, అప్పటికే మృతి చెందినట్లు తేలింది. గత పది రోజులుగా అక్కడే భిక్షాటన చేస్తూ కనిపిస్తుండేవాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.