డివైడర్‌ను ఢీకొట్టిన కారు పూర్తిగా దగ్ధం

డివైడర్‌ను ఢీకొట్టిన కారు పూర్తిగా దగ్ధం

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సింగరాయకొండ జాతీయ రహదారి సమీపంలో గోల్డెన్ కేఫ్ వద్ద ఓ కారు అతి వేగంగా వచ్చి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు బోల్తా పడి ఒక్కసారిగా మంటలు వచ్చి పూర్తిగా దగ్ధం అయింది. నాలుగురికి గాయాలు అయినట్లు సమాచారం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.