అద్దె బస్సు డ్రైవర్లతో అధికారుల చర్చలు

అద్దె బస్సు డ్రైవర్లతో అధికారుల చర్చలు

KDP: జిల్లా దువ్వూరులో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌పై దాడి చేసిన ఘటనకు నిరసనగా బస్సు డ్రైవర్లు ఇవాళ కూడా విధులకు హాజర్ కాలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆర్టీసీ రీజినల్ మేనేజర్ గోపాల రెడ్డితో పాటు డిపో అధికారులు డ్రైవర్లతో చర్చలు నిర్వహించారు. డ్రైవర్లకు భరోసాగా ఉంటామని హామీ ఇచ్చినా డ్రైవర్లు ఒప్పుకోలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.